అఫ్జల్‌ గురుకు ఉరిశిక్ష అమలు

 

 

 Afjal Guru hanged  | terrorist Afzal Guru hanged to death|Afjal Guru hanged| Afzal Guru hanged Tihar jail

 

 

తీవ్రవాది అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన అఫ్జల్‌గురును శనివారం ఉదయం 8 గంటలకు తీహార్ జైల్‌లో అధికారులు ఉరితీశారు. ఈ కేసులో అఫ్జల్‌గురు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తిరస్కరించారు. దాంతో అఫ్జల్‌గురుకు ఉరిశిక్ష అమలు చేశారు.

 

2001 డిసెంబర్ 13 న ఉగ్రవాదులు పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరి కొందరు గాయపడ్డారు. ఈ దాడిలో అఫ్జల్‌గురు ప్రధాన సూత్రధారి. ఈ కేసులో అఫ్జల్‌గురుకు 2004లో సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. 2006లో అఫ్జల్‌గురు క్షమాభిక్ష పిటిషన్‌ను పెట్టుకోవడంతో ఉరిశిక్ష నిలిచిపోయింది. గత నెలలోనే అఫ్జల్‌గురు ఉరిశిక్ష అమలుకు కేంద్ర హోం శాఖ సిఫారసు చేసింది. ఉరి శిక్ష అమలును అధికారులు అత్యంత గోప్యంగా ఉంచారు. శనివారం ఉదయం ఉరిశిక్ష అమలు నేపథ్యంలో శుక్రవారం రాత్రే అఫ్జల్‌గురును తీహార్ జైలుకు తీసుకువచ్చారు.